top of page

రాశి ఫలాలు


మేష రాశి మేష రాశి వారికి గురువారం నాలుగో స్థానము నందు రవి, బుధులు సంచరించుట చేత కుటుంబ సభ్యులు, బంధువులతో వాదోపవాదాలు సంభవించును. పంచమ స్థానమునందు కుజ, శుక్రుల ప్రభావం చేత సంతానము వలన సౌఖ్యము కలుగును. పిల్లలతో ఆనందముగా గడిపెదరు. శని అనుకూల స్థితి వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు ఉండును. ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు శుభ సమయము. ఈరోజు శుభఫలితాలకు గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించండి. వృషభ రాశి వృషభరాశి వారికి ఈ రోజు తృతీయ స్థానము నందు రవి, బుధుల సంచారం వలన బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. నాలుగో స్థానము నందు కుజ, శుక్రుల ప్రభావం చేత కొన్ని విషయాల్లో సంయమనం పాటించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. మిథున రాశి మిథున రాశి వారికి కాలం అనుకూలముగా ఉన్నది. వాక్‌ స్థానములో రవి ప్రభావం ఉన్నందున వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి సమయం. అనుకున్న ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసెదరు. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. విద్యార్థులకు అనుకూలమైన సమయము. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత పనిభారం అధికం. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు తగవు. వాక్‌ స్థానమునందు కుజ, శుక్రుల ప్రభావం చేత ఆగ్రహ, ఆవేశాలకు మరియు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ఈరోజు మరింత శుభఫలితాలకు గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. సింహరాశి సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. వ్యయ స్థానమునందు రవి, బుధుల ప్రభావం ఉన్నందున ఖర్చులు అధికం. జన్మరాశి యందు కుజుని ప్రభావం చేత శారీరక శ్రమ అధికమగును. వినోద విలాసాలపై ఖర్చు చేస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. వ్యాపారస్తులకు పరవాలేదు. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. కన్యారాశి కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. లాభస్థానమునందు రవి, బుధుల ప్రభావంచేత వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. వ్యయస్థానమునందు కుజ, శుక్రుల ప్రభావం చేత సౌఖ్యము, ధన వ్యయము కలుగును. ఆరో స్థానమునందు శని అనుకూలత వలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. విద్యార్థులకు అనుకూల సమయము. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం తాంబూలం, శనగలు దానమివ్వడం మంచిది. తులా రాశి తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలముగా ఉన్నది. ధనలాభము వస్తు లాభము కలుగు సూచన. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకము. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. జన్మ కేతువు ప్రభావం చేత కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. దశమ స్థానమునందు కుజ శుక్రుల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలము. వ్యాపారస్తులకు అనుకూల సమయము. భాగ్యము నందు రవి, బుధుల ప్రభావం చేత కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. అర్దాష్టమ శని ప్రభావం ఉన్నందున పనులు నేర్పుగా చేయాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మరింత శుభఫలితాల కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ధనూ రాశి ధనూరాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. అష్టమ రవి, బుధుల ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. భాగ్యములో కుజ, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగస్తులకు అనుకూల సమయము. సహోద్యోగుల మాటలతో మనస్థాపం చెందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకముగా ఉంటుంది. విద్యార్థులకు మధ్యస్థ సమయము. స్త్రీలకు మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలు కలుగును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం ఈరోజు తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. ఏలినాటి శని ప్రభావము మరియు అష్టమ కుజ, శుక్రుల ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి. ధన వ్యయము అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ప్రతికూల సమయము. పనులయందు ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి. కుంభ రాశి కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. ఆరో స్థానమునందు రవి, బుధులు అనుకూలించుట చేత శత్రువులపై పైచేయి సాధించెదరు. తృతీయము నందు గురుని ప్రభావం చేత సోదరులతో వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. కళత్రము నందు కుజ శుక్రుని ప్రభావం చేత కుటుంబ వ్యవహారాలయందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీలకు ప్రతికూల సమయము. విద్యార్థులకు మధ్యస్థ సమయము. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర, దత్తాత్రేయ స్తోత్రం పఠించాలి. మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు అనుకూలముగా ఉన్నది. ధనలాభము, సౌఖ్యము కలుగును. వస్తు లాభం ఉంటుంది. నూతన వస్త్రాలు ప్రాప్తిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదముగా గడిపెదరు. పొదుపు సూత్రాలు పాటించాలి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం తాంబూలం, శనగలు దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page