top of page

రాశిఫలాలు


మేష రాశి

మేషరాశి వారికి మంచి రోజులు నడుస్తున్నాయి. ఉద్యోగస్తులకు జన్మరాశియందు గురు రాహువులు ప్రభావం ఉన్నందున ఒత్తిడి నుంచి ఉపశమనానికి మార్గాలు అనుసరించాలి. వ్యాపారస్తులు సంయమనం పాటించాలి. కళత్రము నందు కేతువు, నాలుగో ఇంట రవి ఉన్నందున కుటుంబ సభ్యులతో సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. కుజ, శుక్రులు, శని అనుకూల ప్రభావం చేత సంకల్పించిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా చదువుపై మనస్సు లగ్నం చేయాలి. ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడానికి విఘ్నేశ్వరుడిని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం శ్రేష్ఠం. వృషభ రాశి వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. సోదరులతో బంధం పెరుగుతుంది. బంధు మిత్రులతో ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. నూతన వస్తు ప్రాప్తి ఉంది. పొదుపు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉద్యోగస్తులు, విద్యార్థులకు చక్కటి సమయం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. నేడు శుభ ఫలితాల కోసం శ్రీకృష్ణున్ని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. మిథున రాశి

మిథున రాశి జాతకులకు ఈ రోజు అనుకూలముగా ఉన్నది. ఆర్థిక పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారం కోరుతారు. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలకు కాలం అనుకూలం. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులకు అనుకూల సమయము. మరిన్ని శుభ ఫలితాల కోసం మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ శుభాలను తెస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన చేయించుకోవడం శ్రేయస్కరం. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఉద్యోగస్తులు పని భారం వలన సహోద్యోగుల సాయం కోరడంలో తప్పులేదు. వ్యాపారస్తులకు పనులయందు జాప్యం ఏర్పడును. విద్యార్థులకు మధ్యస్త సమయము. వాక్‌ స్థానము నందు కుజుని ప్రభావం ఉంది. అందువల్ల ఆవేశపూరిత నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అష్టమ శని ప్రభావం వలన పనులు జాగ్రత్తగా పూర్తిచేయాలి. శుభ ఫలితాల కోసం ఈరోజు శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించాలి. శ్రీవేంకటేశ్వరుడి అష్టోత్తర శతనామావళి, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం పఠించాలి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకు పని చేసే చోట పని భారం పెరుగును. వ్యాపారస్తులకు ఖర్చులు పెరుగును. భాగ్యమునందు గురు రాహువుల ప్రభావం ఉన్నందున కుటుంబ సభ్యులతో సర్దుకుపోవాలి. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూలమైన సమయము. ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడం కోసం సంకటనాశన గణపతి స్తోత్రాన్ని, గణపతి అష్టోత్తర శతనామావళిని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి

కన్యా రాశి వారికి కాలం అనుకూలముగా ఉన్నది. వ్యాపారంలో లాభాలు చూస్తారు. ఉద్యోగులు, స్త్రీలకు అనుకూల సమయము. అష్టమ గురు రాహువుల ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. శుభ ఫలితాల కోసం ఈరోజు శ్రీకృష్ణున్ని పూజించాలి. కృష్ణాష్టకం పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. పాలతో చేసినటువంటి ప్రసాదాల్ని శ్రీకృష్ణునికి నైవేద్యముగా సమర్పించాలి. భగవద్ గీత త వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి

తులారాశి వారికి ఈరోజు మధ్యస్థముగా ఉన్నది. పని భారం పెరిగినా అన్ని పనులు పూర్తి చేసెదరు. లాభస్థానమునందు గురు, శుక్రుల ప్రభావం చేత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కళత్రం నందు గురు, రాహువుల ప్రభావం ఉన్నందున కుటుంబ సభ్యులతో సర్దుకుపోవడం నేర్చుకోవాలి. కుటుంబ వ్యవహారాల యందు సంక్లిష్టతలు కొనసాగును. శుభ ఫలితాల కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామపారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన చేయించుకోవడం శ్రేయస్కరం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. పని భారం పెరుగును. అయినప్పటికీ దశమము నందు కుజుని ప్రభావం ఉన్నందున సంకల్పించిన పనులు పూర్తవుతాయి. భాగ్య స్థానమునందు బుధుని ప్రభావం వ్యాపారస్తులకు మేలు చేస్తుంది. రాహు కేతువుల అనుకూల స్థితి వలన విద్యార్థులు చదువులో రాణిస్తారు. శుభ ఫలితాల కోసం శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీహరి అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం పఠించండి. ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు పనుల్లో ఒత్తిడి ఎదురవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో నిర్లక్ష్యం తగదు. భాగ్యస్థానమునందు శుక్రుని ప్రభావం ఉన్నందున వ్యాపారాభివృద్ధి జరుగును. గురు, రాహువుల అనుకూల ప్రభావం ఉన్నందున ఉద్యోగస్తులకు, విద్యార్థులకు శుభ సమయం. స్త్రీలకు మధ్యస్థ సమయము. ఈరోజు మీరు మరింత శుభఫలితాలు పొందడం కోసం విఘ్నేశ్వరుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం శ్రేయస్కరం.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు పని భారం పెరుగును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఏలినాటి శని ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో ఉదాసీనత పనికిరాదు. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారం తీసుకోవాలి. వ్యాపారస్తులకు ప్రతికూల సమయం. స్త్రీలకు, విద్యార్థులకు మధ్యస్థ సమయము. ఈరోజు శ్రీకృష్ణున్ని పూజించాలి. భగవద్గీత వినడం, చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉన్నది. పనులయందు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళతో కూడియున్నటువంటి సమయము. వ్యాపారస్తులకు ఖర్చులు నియంత్రించుకోవల్సిన సమయము. స్రీలకు అనుకూలముగా లేదు. విద్యార్థులు కష్టపడవలసినటువంటి సమయము. శుభ ఫలితాల కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి పఠించండి. మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థము నుండి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగు సూచన. వాక్‌ స్థానము నందు గురు, రాహువుల ప్రభావం చేత ఇతరులను నొప్పించకుండా మాట్లాడాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ఆరోగ్యం జాగ్రత్త. స్త్రీలకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ప్రతికూల సమయము. శుభ ఫలితాలకు శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించాలి. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం చదవడం, వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page