top of page
Shiva YT

రాశిఫలాలు..


మేష రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా గడుపుతారు. మరోవైపు మీ పిల్లల గురించి కొంత ఆందోళన ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు రుణాన్ని తిరిగి చెల్లించే ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు. వృషభ రాశి ఈ రాశి వారిలో ఈరోజు రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు మంచి చేకూరుతుంది. మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మరోవైపు మీ పాలనా శక్తితో, సమన్వయంతో మంచి ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి సహకారం లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్‌కు వెళ్లొచ్చు. మిధున రాశి ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో విభేదాలుంటే, అవి ఈరోజు తొలగిపోతాయి. విద్యార్థులు ఈరోజు ఏదైనా పోటీలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు స్నేహితులతో కలిసి ఫంక్షన్ లేదా పార్టీకి హాజరు కావొచ్చు. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో మీకు గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. ఈరోజు మీరు పిల్లలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. మీకు మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. విద్యార్థులకు ఈరోజు విద్యా రంగంలో ఆసక్తికరంగా ఉంటుంది. సింహ రాశి ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించగలరు. వ్యాపారులు ఏదైనా ప్రాజెక్టును పెండింగులో ఉంచితే, దాన్ని తిరిగి ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. ఈరోజు మీరు కొన్ని సాహాసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. కన్య రాశి ఈ రాశి వారికి ఈరోజు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీరు కష్టానికి తగినట్టు ఫలితాలను సాధిస్తారు. మరోవైపు మీ ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. మరోవైపు మీ కుటుంబ సభ్యుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. మీ కుటుంబ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఉపాధి రంగంలో ఉండే వారికి సానుకూల ఫలితాలొస్తాయి. తుల రాశి ఈ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రోజులుగా వ్యాపారులకు ఏవైనా లావాదేవీల సమస్యలుంటే, ఆ సమస్య ఈరోజు తొలగిపోతుంది. మీకు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో మీరు ఓ పార్టీని నిర్వహించొచ్చు. ఈరోజు మీ పురోగతి, విజయాన్ని చూసి ప్రత్యర్థులు అసూయపడతారు. కాబట్టి అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాయంత్రం మీరు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీ మొరటు ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొచ్చు. వ్యాపారులు ఈరోజు లావాదేవీలు, లోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఏదైనా కార్యక్రమం, లేదా ప్రణాళిక గురించి కుటుంబంలో చర్చించొచ్చు. మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారులు ఈరోజు భాగస్వామ్యంతో ఏదైనా పని చేయాలని ఆలోచిస్తుంటే, దాన్ని వాయిదా వేయండి. ఈరోజు సమయం అనుకూలంగా లేదు. ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు గొప్ప విజయాలు దక్కుతాయి. ఈరోజు మీ ప్రత్యర్థులు మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు. ఈరోజు మీరు ప్రభుత్వ పనులకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే మీరు కలత చెందుతారు. ఈరోజు సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేయొచ్చు. ఈ సాయంత్రం మీరు పరిచయస్తులు, స్నేహితులతో కలిసి వినోదభరితమైన క్షణాలను ఆనందిస్తారు. మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో జరిగే వివాదాలకు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నష్టం జరగొచ్చు. మీ ఇంటికి అతిథి రావొచ్చు. మీ పిల్లలను ఏదైనా కోర్సులో చేర్చాలనుకుంటే, ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యర్థుల నుంచి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బంది ఎదురుకావొచ్చు. వ్యాపారులకు కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు మానసిక క్షోభ కలుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో, అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. ఈరోజు మీరు పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. మీన రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు ఏవైనా లావాదేవీలు చేయాలనుకుంటే, మీ జీవిత భాగస్వామిని సంప్రదించాలి. మీరు అప్పుగా తీసుకున్న డబ్బు వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మీ వస్తువులు పోగొట్టుకున్నందుకు కొంత ఆందోళన చెందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.

bottom of page