top of page
Shiva YT

రాశిఫలాలు..


మేషం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి సంబంధమైన కొనుగోలు వ్యవహారాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో అదనపు లాభాలు అందు కుం టారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివచ్చే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు.

వృషభం ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో ఒకరికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. బంధుమిత్రుల్లో కొందరికి మీ సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథునం అన్ని విషయాలలోనూ కుటుంబ సభ్యుల నుంచి, కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధన సంబంధమైన వ్యవహారాల్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో సహోద్యోగులకు మీ నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. లాభదాయకమైన స్నేహాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార విహార విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

కర్కాటకం అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు సమసిపోతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వృత్తి జీవితంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగ స్వామికి ఉరోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

సింహం మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేసి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తప్పని సరిగా పొదుపు పాటించాల్సిన, ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితిలో మీరున్నారు. బంధు మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. విదేశీ యానానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కన్య నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. సద్వినియోగం చేసుకోవడం మంచిది. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు ప్రవేశపెడతారు. వ్యాపారాలలో ఒక మోస్తరు లాభాలు కనిపిస్తాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

తుల ఒకేసారి అనేక వ్యవహారాలను చక్కబెట్టాలని ప్రయత్నించి అసౌకర్యానికి గురవుతారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సన్నిహితులతో అపార్థాలు తలెత్తవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సమ యం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పరవా లేదు.

వృశ్చికం వృత్తి, వ్యాపారాలలో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కృషికి తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పిల్లలతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్ కు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి.

ధనుస్సు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలను, ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యో గాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలను మించి లాభాలు గడిస్తారు. పిల్లలతో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ, మొత్తం మీద కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

మకరం స్థిరాస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలను చక్క దిద్దడంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త వింటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరి ష్కారం దొరుకుతుంది. ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి.

కుంభం ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఇంటా బయటా ఊహించని ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో డిమాండ్ పెరుగుతుంది కానీ, ఆశించిన స్థాయిలో సంపాదన పెరగకపోవచ్చు. ప్రయా ణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

మీనం ముఖ్యమైన పనులన్నీ లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితా లను ఇస్తాయి. బంధువుల శుభకార్యానికి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, అనవసర ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంది.

bottom of page