top of page
Shiva YT

రాశిఫలాలు..!


మేషం పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసు కోవాల్సి వస్తుంది. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృషభం కుటుంబ వ్యవహారాల్లో మీ ఆలోచనలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఇంటా బయటా మీ విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రయాణాల వల్ల అంచనాలకు మించి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.

మిథునం నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబం ధించిన పనులు ఊపందుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది. కీలక బాధ్యత లను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. కర్కాటకం సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్త వింటారు. వృత్తి జీవితంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా డిమాండ్ పెరుగు తుంది. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఒక ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇంటికి బంధుమిత్రుల రాకలు ఉంటాయి. విందులు, వినోదాల్లో పాల్గొం టారు. పిల్లల చదువుల విషయంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య కెరీర్ పరంగా అంతా సవ్యంగానే జరిగిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సా హం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తన రంగంలో పురోగతి చెందుతారు. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.

తుల పెరిగే ఆదాయానికి దీటుగా వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు చేతి దగ్గరకు వస్తాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు చక్కబడుతుంది. వ్యాపారాల పరంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచ నలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

వృశ్చికం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల నుంచి అవసరమైన, ఆశించిన సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ సకాలంలో బాధ్యతలను నిర్వర్తి స్తారు. వృత్తి జీవితం సజావుగా, సాఫీగా సాగిపోతుంది. ఇంటికి బాగా దగ్గర బంధువుల రాకపోక లుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనవసర కోపతాపాలతో కుటుంబంలో ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి గౌరవ మన్ననలు లభిస్తాయి. నిరుద్యోగులు ఆఫర్లు అందుకుంటారు. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారా లను ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెడతారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరుస్తాయి. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు.

మకరం ఉద్యోగంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి జీవితం అంచనాలకు మించి ఎదు గుతుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెడతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అశ్రద్ధ తగదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు, సహనా లతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యుల తోడ్పాటును తీసుకోవడం అవసరం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన ఔదార్యాన్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం

జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో బాగా అనుకూ లత పెరుగుతుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. సమయ స్ఫూర్తితో వ్యవహరించి స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

bottom of page