top of page

బ్రెడ్‌తో రసగుల్లాలు.. టేస్ట్ అదిరి పోవాల్సిందే..


బ్రెడ్‌ రసగుల్లాలకి కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, మిల్క్, పంచదార, యాలకుల పొడి, నిమ్మ రసం, నట్స్.

బ్రెడ్‌ రసగుల్లాల తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ ముక్కల అంచులను కట్ చేసి.. చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి. పాలు మరిగాక.. నిమ్మరసం పిండి పాలను విరగ్గొట్టాలి. వెనిగర్ అయినా ఉపయోగించవచ్చు. పాలు విరిగాక వడకట్టి పన్నీర్ మిశ్రమాన్ని వేరు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పన్నీర్‌ తీసి పక్కన పెట్టాలి. ఇందులో బ్రెడ్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంతో చిన్న చిన్న లడ్డూలు చుట్టుకోవాలి. ఆ తర్వాత రసగుల్లా సిరప్ తయారు చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేయాలి. పంచదార సిరప్ బాగా మరిగాక.. ఇందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న లడ్డూలు వేసి ఓ పావు గంట సేపు ఉడికించాలి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రసగుల్లాలు సిద్ధం. కావాలి అంటే వీటిని ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా కూడా తినవచ్చు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page