top of page

‘మెగా పవర్ స్టార్‏కు అరుదైన గౌరవం.. రామ్ చరణ్‏కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్..’ 🌟🏆

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరో. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది.

ముఖ్యంగా ఇందులో అల్లూరి సీతారామారాజు పాత్రలో చెర్రీ నటనకు భారతీయులు, హాలీవుడ్ మేకర్స్, విదేశీయులు ముగ్దులయ్యారు. హాలీవుడ్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజాలు తారక్, చరణ్ నటన చూసి ఫిదా అయ్యారు. దీంతో వీరిద్దరి పేర్లు వరల్డ్ వైడ్ మారుమోగాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో తమ నటనకు గానూ ఇప్పటికే ఎన్నో అవార్డ్ అందకున్నారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్‏కు మరో అరుదైన గౌరవం దక్కింది. చెర్రీ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్.. ఇండియా సెలబ్రెటీలకు కూడా ఇస్తుంటారు. గతంలో బాలీవుడ్ స్టార్లకు ఈ అవార్డ్స్ వచ్చాయి. షారుఖ్, దీపికా పదుకొణెలకు అవార్డ్స్ రాగా.. ఈసారి రామ్ చరణ్ సైతం చోటు దక్కించుకున్నారు. 🌟🏆✨


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page