top of page

🐦🌿 వేగంగా తగ్గిపోతున్న పక్షుల జాతులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు 🌳🐥

🔍 భారత్‌లో జరిగినటువంటి తాజా అధ్యయనం కీలక విషయం వెల్లడించింది. విషతుల్య పదార్థాలను తినడం వల్ల పక్షుల సంఖ్య తగ్గిపోతోందని నిర్ధారించింది. 🥦🐦

అలాగే వలస పక్షుల సంఖ్య కూడా వేగంగా క్షీణిస్తోంది. 🏞️🕊️ పశ్చిమ కనుమలు, శ్రీలంక మధ్య వలస వెళ్లే పక్షుల విషయంలో ఈ తరుగుదల మరింత ఎక్కువగా కనిపిస్తోంది. 🏝️🦜 అడవులు అంతరించిపోవడం వల్ల ప్రస్తుతం అక్కడ జీవనం సాగిస్తున్న పక్షులకు ప్రాణాంతకరంగా మారింది. 🌲🦚 మరోవైపు చిత్తడి నేలలు తరిగిపోవడం వల్ల బాతుల ఉనికిని దెబ్బతీస్తోంది. 🏙️🕊️ అలాగే భారత్‌లో పట్టణ విస్తరణ, టేకు చెట్ల మాదిరిగా ఒకే తరహా వృక్ష వనాల పెంపకం, మౌలిక వసతుల విస్తరణ పక్షిజాతులకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. 🌳🌳 ఒకప్పుడు ఎక్కువగా కనిపించే పక్షులు చాలావరకు ఇప్పుడు తగ్గిపోవడంతో జంతు ప్రేమికులతో సహా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 🦜🦢🔊 ఇకనుంచైనా వాటి ఉనికి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. 🌍🐦



Comments


bottom of page