top of page
MediaFx

ప్రశాంత్ వర్మ సినిమా నుంచి తప్పుకున్న రణవీర్ సింగ్..?🚨


హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ భారీ వసూళ్లను రాబట్టింది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే ఓటీటీలో ఈ సినిమా హిందీలోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి కొన్ని ప్రీ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉన్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ లోగా ఆయన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో ఓ సినిమా చేస్తున్నారు వార్తలు వస్తున్నాయి. రాక్షస అనే టైటిల్ తో ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ తో సినిమా చేస్తున్నాడు.

సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమానుంచి హీరో రణవీర్ సింగ్ తప్పుకున్నారని తెలుస్తోంది. దర్శకుడి , హీరో కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో రణవీర్ సింగ్ ఈ మూవీ నుంచి బయటకు వచేశారని టాక్ వినిపిస్తుంది. మొన్నీమధ్య ఏప్రిల్ లో రణవీర్ సింగ్ హైదరాబాద్ కు వచ్చాడు. అయితే రాక్షస సినిమా కోసమే రణవీర్ సింగ్ హైదరాబాద్ కు వచ్చాడని.. రణవీర్ పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని కూడా తెలుస్తోంది.

రాక్షస సినిమా కూడా మన పురాణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించాలని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో హీరో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. కానీ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడంతో హీరో తప్పుకున్నాడని తెలుస్తోంది. రణవీర్ సింగ్ బాలీవుడ్ లో బిజీ హీరో వరుసగా సినిమాలను లైనప్ చేసి ఉన్నాడు. అలాగే త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతని భార్య దీపికా పదుకొనె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది.


Related Posts

See All
bottom of page