top of page

అన్ని కోట్లు వస్తేనే "రంగబలి" హిట్..

తెలుగు సినిమాఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈ నటుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో మూవీ తో అదిరిపోయే రేంజ్ కమర్షియల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నాగ శౌర్య క్రేజ్ టాలీవుడ్ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఆ తర్వాత నుండి ఈ కాకపోతే ఛలోమూవీ తర్వాత ఈ నటుడుకి అంతటి స్థాయి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ నటుడు రంగబలి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల షేర్ కలెక్షన్ లను సాధిస్తే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా కలిపి దాదాపు 5.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీనితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.20 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి. ఇకపోతే సుధాకర్ చేరుకురి నిర్మించిన ఈ సినిమాకు పవన్ బాసంసెట్టి దర్శకత్వం వహించాడు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page