top of page
Suresh D

వైజాగ్ బీచ్‏లో కూతురు క్లింకారతో రామ్ చరణ్ ఆటలు..🎥✨


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమూవీ షూటింగ్ ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతుంది. ఇటీవలే చరణ్ వైజాగ్ వెళ్లారు. కొన్నిరోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే చరణ్ కోసం కూతురు క్లింకారతో కలిసి ఉపాసన కొణిదెల కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా ఉపాసన తన ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లింకార, చెర్రీ పెట్ రైమ్‏తో వైజాగ్ బీచ్‏లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ.. క్లింకారతో కలిసి చిన్నపిల్లాడిలా మారిపోయి సముద్రపు ఒడ్డున రైమ్‏తో కలిసి ఆడుకున్నారు చరణ్. కూతురి పాదాలను సముద్రపు నీటిలో తాకిస్తూ ఎంజాయ్ చేశారు రామ్. బీచ్‏లో కూతురితో కలిసి చరణ్ ఆడుకుంటున్న క్షణాలను వీడియోగా క్రియేట్ చేసి బ్యాగ్రౌండ్ లో ఆరెంజ్ సినిమాలోని రూబా రూబా సాంగ్ జత చేసి షేర్ చేశారు ఉపాసన. ప్రస్తుతం ఈ వీడియో మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత చరణ్ తన కూతురితో కలిసి చిన్నపిల్లాడిలా ఆడుకోవడం చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్.🎥✨


bottom of page