top of page
Suresh D

ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ🎥✨



జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR). డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2022 మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. 'బాహుబలి'తో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో తెలుగు సినిమా గురించి హాలీవుడ్ ప్రముఖులు కూడా మాట్లాడుకునేలా చేశాడు. 'నాటు నాటు' సాంగ్ అయితే ఏకంగా ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గెలుచుకోవడం విశేషం. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో ఎన్టీఆర్, చరణ్ కి గ్లోబల్ రీచ్ వచ్చింది. ఇక దర్శకుడు రాజమౌళిని అభిమానించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెరిగింది.ఈ మూవీ విడుద‌లై ఈరోజుతో రెండు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీంతో అభిమానులు ట్విట్టర్‌లో ట్రిపుల్ ఆర్ మూవీని ట్రెండ్ చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీకి రెండేళ్లు అని ట్వీట్లు చేస్తున్నారు.🎥✨

bottom of page