top of page
Suresh D

రామ్ చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫోటోలు, వీడియోలు లీక్..🎥✨

గేమ్ ఛేంజర్ కు లీకుల బెడద తప్పడం లేదు. వీటిని అరికట్టేందుకు ఈ సినిమా షూటింగ్‌లో చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా కూడా లీకుల బెడద ఆగడం లేదు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంటున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రం కావడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్  దర్శకత్వం వహిస్తుండడంతో ఆ అంచనాలు మరింత తారస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ కు లీకుల బెడద తప్పడం లేదు. వీటిని అరికట్టేందుకు ఈ సినిమా షూటింగ్‌లో చిత్రబృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా కూడా లీకుల బెడద ఆగడం లేదు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ సెట్ నుండి మరి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో రామ్ చరణ్ పాత్ర లుక్ కూడా రివీల్ అయింది . ఈ ఫోటో అభిమానుల పేజీల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ లుక్‌ అదిరిపోయింది. వీడియోలో ఫుల్ ఫ్రొఫెషనల్‌గా కనిపించాడు చెర్రీ. ఇది చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లుక్ సూపర్బ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.🎥✨


bottom of page