top of page
Suresh D

దక్షిణ భారతదేశంలోనే అత్యంత రిచెస్ట్✨


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు దక్షిణ భారతదేశంలోనే అత్యంత రిచెస్ట్ కపుల్ గా నిలిచారు. వీరిద్దరి జంట చాలామందికి రోల్ మోడల్ గా నిలుస్తుంటుంది. నటుడిగా ఆదాయంతోపాటు చిరంజీవి నుంచి వచ్చిన ఆస్తి, ఉపాసనకు వచ్చిన ఆస్తి కలుపుకొని, వ్యాపారం ద్వారా వస్తున్న రాబడిని కూడా లెక్కేసుకుంటే ఈ జంట ఆదాయం భారీగా ఉంటోందని తెలుస్తోంది. ఈ ఇద్దరికీ కలిపి ఉన్న ఆస్తుల విలువ తెలుసుకుంటే షాక్ అవడం ఖాయమంటున్నారు.రామ్ చరణ్, ఉపాసనకు కలిపి రూ. 2,500 కోట్లకి పైగా ఆస్తి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న ఈ సినిమాతో రామ్ చరణ్ స్థాయి బాగా పెరిగింది. మొత్తం ఆస్తిలో రామ్ చరణ్ ఆస్తి విలువ రూ.1370 కోట్లు కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.45 కోట్ల పారితోషికం తీసుకున్నాడు. తర్వాత వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు రూ.100 కోట్లు తీసుకున్నారని సమాచారం.దేశంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరొంది అపోలో ఆసుపత్రిలో భాగస్వామిగా ఉంది. అపోలో మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.77వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకున్నారు. దీనివిలువ రూ.30 కోట్లుగా ఉంటుంది. చెర్రీకి సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ఉంది. ఎక్కడికి వెళ్లాలన్నా దీన్నే వాడతారు. చిరంజీవి కూడా దీన్ని అప్పుడప్పుడు వాడుతుంటారు. విలువైన కార్లు కూడా చెర్రీకి ఉన్నాయి. రోల్స్ రోయస్ ఫాంటమ్ కారు అత్యంత విలువైనది. దీని విలువ రూ.9.57 కోట్లు ఉంటుంది. మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్ఎస్ 600 కారు విలువ రూ.4 కోట్లు, కారు ఫెర్రాయి పోర్టోఫినో విలువ రూ.3.50 కోట్లు, ఆస్టన్ మార్టిన్ వింటేజ్ వి8 కారు విలువ రూ.3.2 కోట్లుగా ఉంది.

bottom of page