top of page
Suresh D

రామ్ చరణ్ - పవన్ కల్యాణ్​ కలిసి నన్ను చాలా బాధపెట్టారు - ఒంటరోడిని చేశారు! 😔

సేమ్ టైమ్ లో టీవీలో యాడ్స్ వచ్చేవి. నేను చిరంజీవి గారి సైడ్ ఉండేవాడిని. చరణ్ అన్న మాత్రం పవన్ కల్యాణ్ బాబాయి వైపు ఉండేవాడు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్.. ''మెగా ఫ్యామిలీ విషయాన్ని బయటపెట్టారు. నా చిన్నప్పుడు... కల్యాణ్ బాబాయి పెప్సీ యాడ్ చేసేవారు.. అదే చిరంజీవి గారు థంబ్స్ అప్ యాడ్ చేసేవారు. సేమ్ టైమ్ లో టీవీలో యాడ్స్ వచ్చేవి. నేను చిరంజీవి గారి సైడ్ ఉండేవాడిని. చరణ్ అన్న మాత్రం పవన్ కల్యాణ్ బాబాయి వైపు ఉండేవాడు. నేను చరణ్ కలిసి ట్రోల్ చేసుకునేవాళ్లం. థంబ్స్ అప్ తాగే వాళ్లు గ్రోయింగ్ మెన్ అనేది ఏదో ఉండేది.. అలా ట్రోల్ చేసుకునేవాళ్లం''మని తెలిపాడు. ''సరే చిరంజీవి గారు ఉన్నంత వరకు ఫుల్ ప్రొటెక్షన్ ఉండేది. కానీ ఆయన షూటింగ్ వెళ్లిపోతే మాత్రం పవన్ బాబాయి, చరణ్ కలిసి నన్ను బాగా ఆటడేసుకునేవాళ్లు. ఇద్దరు కలిసి రూమ్ లో వేసి లాక్ చేసి.. లైట్స్ ఆఫ్ చేసి.. ఏడిపించేవాళ్లు. నన్ను చాలా భయపెట్టేవాళ్లు.. పెరిగెటప్పుడు రామ్ చరణ్ పవన్ కల్యాణ్ ఓ టీమ్ లాగా పెరిగారు. ఇదంతా ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుందని'' వరుణ్ తేజ్ చెప్పుకువచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 😂🎥


bottom of page