top of page

అరియానాతోనూ రాజ్ తరుణ్‌కు ఎఫైర్..


రాజ్ తరుణ్, లావణ్య యవ్వారం రోజుకొక్క మలుపుతిరుగుతుంది. తనను మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని. సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నాడు అంటుంది లావణ్య అనే యువతి. తనను ప్రేమించి ఇప్పుడు మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేసింది లావణ్య. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. అందుకే తనను దూరం పెడుతున్నాడని ఆరోపిస్తుంది లావణ్య. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తిరగబడరా సామి అనే సినిమా చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తనపై లావణ్య చేసిన ఆరోపణలను రాజ్ తరుణ్ ఖండించాడు. తాజాగా రాజ్ తరుణ్ కు బిగ్ బాస్ ఫెమ్ అరియానా గ్లోరీ కి కూడా ఎఫైర్ ఉందని ;అంటుంది రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య. మాల్వి మల్హోత్రతోనే కాదు మరికొంతమందితోనూ రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని తెలిపింది లావణ్య. ఈ క్రమంలోనే అరియానాతోనూ అతను ఎఫైర్ పెట్టుకున్నాడని.. అరియానా గ్లోరీతో ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కి వెళ్లాడు రాజ్ తరుణ్. నేను కోర్స్ నేర్చుకోవడానికి మూడు నెలలు గోవా వెళ్లాను ఆ టైం లో రాజ్ తరుణ్ అరియానాకు దగ్గరయ్యాడు. నేను వెళ్లిన నెలరోజులకు రాజ్ తరుణ్, అరియానా కలవడం మొదలు పెట్టారు. ఈ విషయం నాకు రాజ్ తరుణ్ మేనేజర్, నటుడు రాజా రవీంద్ర ఫోన్ చేసి చెప్పారు.. లేకపోతే ఈ ఇద్దరి యవ్వారం నాకు తెలిసేది కాదు అని తెలిపింది లావణ్య.

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page