top of page
Suresh D

అక్రమ సంబంధమే కారణం.. వీడిన జంట ఆత్మహత్యల మిస్టరీ🕵️‍♂️🚓

రాజేంద్ర నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న జంట మరణాలకు కారణాలను పోలీసులు కనిపెట్టారు. 🕵️‍♂️ గత వారం రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుమ్మకొండకాలనీలో ఈనెల 23న అక్కా తమ్ముళ్ల వరుసైన జంట ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 🌧️

స్రవంతి అలియాస్ చామంతి, శేఖర్ గౌడ్‌ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు. 💔 భర్త, ఇతర కుటుంబ సభ్యులు పొరుగూరు వెళ్లిన సమయంలో చామంతి ఇంట్లోనే ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 😢

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన నరసింహ గౌడ్ ,సోమేష్ గౌడ్ అన్నదమ్ములు. 1️⃣2️⃣ ఏళ్ల క్రితం బ్రతుకు దెరువు కోసం నగరానికి వలస వచ్చారు. 🚗

రాజేంద్రనగర్ సర్కిల్ లోని హైదర్ గూడా కేశవ్ నగర్ లోని సొంత ఇల్లు కట్టుకొని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. 🏡 భవనం పై అంతస్తులో నరసింహ, స్వప్న దంపతులు, తమ ఇద్దరు కుమారులతో పాటు నరసింహ మేనమామ కుమారుడు.. స్వప్న సోదరుడైన శేఖర్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. 👨‍👩‍👧‍👦

కింది అంతస్తులో సోమేశ్ అతని భార్య స్రవంతి అలియాస్ చామంతి (28) ఇద్దరి కుమారులతో కలిసి ఉంటున్నారు. 🚻 నరసింహ, సోమేశ్ అన్నదమ్ములు ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేస్తుండగా మృతుడు శేఖర్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 🏢 మృతురాలు చామంతి స్థానికంగా ఇళ్లలో పనిచేసేది. 🌆

ఈ నెల 23వ తేదీన స్వగ్రామంలో బంధువు దశ దినకర్మ ఉండడంతో నరసింహ, సోమేశ్ తో పాటు స్వప్న వెళ్లారు. 🌄 ఉదయం పిల్లలను స్కూల్లో వదిలి వెళ్చిన సోమేశ్ భార్య స్రవంతి ఇంట్లోనే ఉంది. 📚

మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో స్రవంతి కుమారులు శశి చెందు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. 🕰️ గది లోపలకి వెళ్లి చూడగా తల్లి ఉరివేసుకొని వేలాడుతూ కనిపిచింది. 🔍 భయంతో పిల్లలు వెంటనే బయటికి వచ్చి పక్కింటి వారితో విషయం చెప్పారు. 😨 వారు భర్త సోమేశ్ తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. 🚓

భర్త మేనమామ కుమారుడైన శేఖర్‌తో చామంతి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసు విచారణలో గుర్తించారు. 🔍 వారిద్దరి సెల్‌ఫోన్లను పరిశీలించిన పోలీసులు ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 📱

స్రవంతి నిత్యం ఐదారుసార్లు శేఖర్ గౌడ్‌తో సంభాషించేది. 👫 ఇద్దరు తమ ఫొటోస్ ఒకరికొకరు పంపుకోవడం, వాటికి కామెంట్లు పెట్టుకోవడం చేస్తున్నట్లు గుర్తించారు. 📷

శేఖర్ గౌడ్‌‌కు ఇటీవల పెళ్లి సంబంధాలు చూశారు. 💔 వివాహమై వెళ్లిపోతే తనకు దూరం అవుతాడని చామంతికి బెంగ పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 🕵️ ఈనెల 23న కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇద్దరు మాట్లాడుకున్నారు. 👥

మొదట చామంతి ఆత్మహత్య చేసుకోగా భయపడిన శేఖర్‌గౌడ్ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ⚰️ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఇద్దరు ఉరేసుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. 😢 ఈ ఘటనలో చామంతి పిల్లలు తల్లి లేని వారయ్యారు. 👶 మరోవైపు కుమారుడు పోయిన దుఃఖంతో శేఖర్ గౌడ్ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. 😔

bottom of page