top of page
MediaFx

రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా మ్యాచ్ రద్దు..


IPL 2024 సీజన్‌ లో భాగంగా ఆదివారం (మే 19) జరగాల్సిన రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయింది . భారీ వర్షం కారణంగా గౌహతిలోని బుర్సపరా స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. కాగా ఈ మ్యాచ్ తో లీగ్ గేమ్స్ మొత్తం పూర్తయ్యాయి. పాయింట్ల పట్టికలో కేకేఆర్ జట్టు మొదటి స్థానంలో ఉంది. తద్వారా తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కేకేఆర్ జట్టు తలపడనుంది. మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు RCBతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. కాగా మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నుంచే గువాహటిలో భారీ వర్షం కురిసింది. దీంతో కూడా టాస్ కూడా పడలేదు. అయితే ఎట్టకేలకు 10 గంటల తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేశారు. మ్యాచ్ ను 7 ఓవర్ల కు కుదించారు. కోల్‌కతా టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 10:45 గంటలకు ప్రారంభించాలనుకున్నారు. కానీ, అంతలోనే మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండు జట్లు (ప్లేయింగ్ XI) ఇలా.. రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, నాండ్రే బెర్గర్. ఇంపాక్ట్ ప్లేయర్లు: శుభమ్ దూబే, కేశవ్ మహారాజ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్, డోనోవన్ ఫెరీరా కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్లు: వైభవ్ అరోరా, మనీష్ పాండే, నితీష్ రాణా, KS భరత్, షెర్ఫైన్ రూథర్‌ఫోర్డ్.

bottom of page