top of page
Shiva YT

🎨 రాజన్న సిరిసిల్ల చేనేత కాళాకారుడి అద్భుత సృష్టి

👚 ఇప్పటి వరకూ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర, సుగంధాలు వెదజల్లే చీర, దబ్బలంలో దూరే చీరలను తయారు చేసి ఓహో అనిపించారు ఆ తండ్రీ కొడుకులు. 🧥

కానీ రంగులు మార్చే చీరను ఎప్పుడైనా చూశారా? తాజాగా రాజన్న సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ మరోసారి తన అద్భుత ప్రతిభను కనబరిచాడు. 🌈 రంగులు మారే ఊసరవెల్లి చీరను రూపొందించి ఔరా అనిపించాడు. 🎨 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో చీర తయారు చేశాడు. 💰 ఆరున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు ఉన్న ఈ చీర రంగులు మారుస్తూ చూపరులను ఆకట్టుకుంది. 💰 దీనికి రూ.2 లక్షల 80 వేలు ఖర్చయ్యిందని విజయ్​చెప్పాడు. బంగారు, వెండి, లేత గులాబీ వర్ణాలు మారుస్తూ ఊసరవెల్లిని తలపించేలా ఉంది. 💫 600 గ్రాముల బరువున్న ఈ చీరను తయారు చేసేందుకు తనకు నెల రోజులు పట్టిందని చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ పేర్కొన్నాడు. 🎉 ఓ వ్యాపారవేత్త ఆర్డర్​ఇవ్వడంతో రంగులు మారే చీరను తయారు చేసినట్టు తెలిపాడు. నల్ల విజయ్‌ తయారు చేసిన రంగులుమారే ఊసరవెల్లి చీరను హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సోమవారం మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. 👏👏👏

bottom of page