top of page

🎬ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేయనున్న రాజమౌళి 🎥🎤

🎬ప్రభాస్ నటించిన ‘బాహుబలి 2’ విడుదలై చాలా ఏళ్ళు గడిచాయి. ఆ తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఏ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోలేదు. దాంతో ప్రభాస్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

‘సలార్’తో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు ప్రభాస్. సలార్ సినిమా రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దాంతో ఈ సినిమా పై ఆసక్తి రెట్టింపైంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ సినిమాకు రాజమౌళి సపోర్ట్ చేస్తున్నాడు. రాజమౌళి తన స్నేహితుడి సినిమా ప్రమోషన్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది.🎬

ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌లను రాజమౌళి ఇంటర్వ్యూ చేయనున్నారు. దీన్ని యూట్యూబ్‌లో షేర్ చేయాలని హోంబలే ఫిల్మ్స్ నిర్ణయించింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సలార్ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో రాజమౌళి ‘రాధే శ్యామ్’ విడుదల సందర్భంగా ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ‘సలార్‌’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 🎬అయితే చిత్ర బృందం ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ చేయడం లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ‘హోంబాలే ఫిలింస్’ ద్వారా భారీ బడ్జెట్‌తో రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందురు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు తదితరులు నటించారు. డిసెంబర్ 22న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 🌟


Kommentarer


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page