top of page
MediaFx

రాజమౌళి స్ఫూర్తితో దర్శకుడైన ప్రశాంత్ రెడ్డి

రాజమౌళి(Rajamouli) భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. ప్రతి సినిమాకి మంచి విజయం సాధిస్తూ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. RRR సినిమాలో ఓ సాంగ్ కి ఆస్కార్ అవార్డు సాధించి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళిని చూసి ఇన్‌స్పైర్ అయి సినీ పరిశ్రమకు వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓ డైరెక్టర్ రాజమౌళి వల్లే దర్శకుడిని అయ్యాను అంటూ తెలిపాడు. హీరో కార్తికేయ ఇప్పుడు భజే వాయువేగం(Bhaje Vaayu Vegam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తాను సినీ పరిశ్రమకు ఎలా వచ్చింది తెలిపాడు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాది మెదక్. నేను కాలేజీ చదువుతున్నప్పుడు రాజమౌళి సై సినిమా మెదక్ లో షూటింగ్ చేసారు. చాలా రోజులు అక్కడే షూట్ చేసారు. కాలేజీ మానేసి రోజూ షూటింగ్ చూడటానికి వెళ్ళేవాడిని. ఓ రోజు రాజమౌళి గారు నన్ను గుర్తుపట్టి రోజు కాలేజీ మానేసి షూటింగ్ కి వస్తున్నావా అని అడిగారు. ఆయన స్ఫూర్తితోనే సినీ పరిశ్రమలోకి వచ్చాను. రన్ రాజా రన్ సినిమా నుంచి ఇప్పటివరకు కూడా యూవీ క్రియేషన్స్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఇప్పుడు భజే వాయువేగం సినిమాతో దర్శకుడిగా మారినట్టు తెలిపాడు. అయితే రాజమౌళిని ఇంకా కలిసి ఈ విషయం చెప్పలేదని, ఈ సినిమా సక్సెస్ అయ్యాక చెప్తాను అని తెలిపాడు

bottom of page