top of page

🎬 హైదరాబాద్‏లో ‘సలార్’ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి.. ధర ఎంతో తెలుసా? 🎟️

🎥 సలార్ సినిమాతోపాటు.. అటు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటించిన డంకీ చిత్రం సైతం విడుదల కాబోతుంది. దీంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద షారుఖ్, ప్రభాస్ మధ్య గట్టిపోటి జరగనుంది.

అందుకే సలార్ ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఏ చిన్న అప్డేట్.. ప్రయత్నం వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ముందుకు వచ్చాడు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. 🌟 అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ముందుగానే టికెట్ కొన్నారు. అయితే బుకింగ్స్ ఓపెన్ కాకముందే కొనుక్కోవడం కారణంగా ఆ టికెట్ ధర సుమారు రూ.10,116 ఉంటుందని తెలుస్తోంది. 🎫 ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

📸 సలార్ చిత్రయూనిట్ ఎస్ఎస్ రాజమౌళికి టికెట్ ను అందిస్తున్న ఫోటోను షేర్ చేసింది. 🌠 ఉదయం 7 గంటలకు తెల్లవారుజామునే ఫస్ట్ షో బుక్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. టికెట్టు ప్రకారం ఆయన RTC ‘X’ రోడ్స్‌లోని సంధ్య 70MM థియేటర్‌లో సినిమా చూస్తారు. ఇక ఇప్పటికే కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సెషన్ సృష్టించాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 🌌

Commenti


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page