top of page

తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తులు..?

ఒకప్పుడు అన్న ఎన్టీఆర్.. అప్పటివరకు మదరాసీలు పిలవబడుతున్న మనల్ని తెలుగు వారమంటూ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనుకునేవాళ్లకు.. సౌత్ సినిమాను.. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌ను పరిచయం చేసిన వ్యక్తులు వీళ్లిద్దరూ..

సోషల్ మీడియా అంటే కేవలం టైమ్ పాస్ మాత్రమే కాదు. ఎన్నో మధురానుభూతులను అందులో పంచుకోవచ్చు. జీవితాల్లోని అద్భుతమైన క్షణాల్లో క్లిక్ చేసిన ఫోటోలు, అరుదైన వీడియోలను అందరితో షేర్ చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సెలబ్రిటీలు సైతం తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందుకు అలాంటి పిక్ తీసుకొచ్చాం. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు. వారిద్దరూ కజిన్స్. తమ, తమ విభాగాల్లో అద్భతమైన ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టారు. వీరిలో ఒకరు ఫిల్మ్ ఫీల్డ్‌లో అత్యున్నమైనదిగా భావించే ఆస్కార్ అవార్డు అందుకున్నారు. హా.. ఇప్పుడు ఈ ఫోటోలోని వారు ఎవరో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. యస్.. అందులో ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి గారితో పాటు తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి ఉన్నారు. ఈ ఫోటో 1976లో తీసింది. ఎడమవైపున ఉన్న టీనేజ్ యువకుడు కీరవాణి. చారల చొక్కాతో ఉన్న మరో చిన్న బాలుడు ఎస్ఎస్ రాజమౌళి.




ఎంఎం కీరవాణి.. తన వినసొంపైన బాణీలతో దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు. కెరీర్లో ఎన్నో వేల పాటలను కంపోజ్ చేశాడు. అయితే గతేడాది ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం కీరవాణిని మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతో అతడు అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నాడు. నాటు నాటు పాటకు గానూ ఆయనకు అత్యున్నత ఆస్కార్ దక్కింది. ఎంఎం కీరవాణి… ఇప్పుడది పేరు మాత్రమే కాదు. ఆస్కార్ వినువీధుల్లో మన పతాకను ఎగరేస్తున్న తెలుగోడి బ్రాండ్. కోట్లాదిమంది భారతీయుల బంగారు కలల్ని తన కలలుగా చేసుకుని సాకారం చేసుకున్న సాధకుడు కీరవాణి. మూడు దశాబ్దాలకు పైగా ఆయన సంగీతంతో చేసిన సావాసం… ఇప్పుడు ఇండియన్ సినిమా స్థాయిని ఖండాంతరాల్ని దాటించేంది.ఇక రాజమౌళి గురించి చెప్పేది ఏముంది. ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకుడు. సినిమా సినిమాకు వైవిధ్యం ప్రదర్శిస్తూ.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలకు విస్తరించాడు. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాలు రాజమౌళి స్థాయిని చాటిచెప్పాయి. త్వరలోనే ఆయన మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత మహా భారతాన్ని కూడా తమ మార్క్ మేకింగ్‌తో తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page