top of page

ఆదిలాబాద్‌లో రాహుల్‌ బహిరంగ సభ..

ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాహూల్ గాంధీ హాజరయ్యారు. ప్రాజెక్ట్‌ నిర్మాణాల్లో అవినీతి జరిగింది. తెలంగాణలో ఒక్క కుటుంబమే బాగుపడిందన్నారు.

ప్రజల తెలంగాణ తప్పకుండా వస్తుంది. ప్రభుత్వం లాక్కున్న ఆదివాసీల భూములను తిరిగి అప్పగిస్తామన్నారు. ధరణితో 20 లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారని ఆరోపించారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. తెలంగణ ప్రజల స్వప్నాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం నాశనం చేసిందని ఘాటుగా స్పందించారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలను నెరవేర్చాలి అప్పుడే తెలంగాణ స్వప్నం సాకారమవుతుందన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్‌తో పాటూ వారికి చేదోడుగా నిలుస్తామన్నారు.

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ఇస్తోంది. ఇవి గ్యారంటీలు మాత్రమే కాదు..చట్టాలుగా మారుస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలి కేబినెట్‌ భేటీ చేసి ఆరు గ్యారంటీలను చట్టాలుగా మారుస్తూ తీర్మానం చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ను ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడంతోపాటూ అన్నదాతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతామన్నారు. ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షల సాయంతో పాటూఆరు గ్యారంటీల అమలుతో దొరల తెలంగాణ అంతమొందిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, మజ్లిస్‌ ఈ మూడు పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. మోదీ ఎప్పటికీ ప్రధానిగా ఉండాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారంటూ రాహూల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ఉండాలని మోదీ కోరుకుంటున్నారన్నారు. నరేంద్ర మోదీ సర్కార్‌పై నా పోరాటం ఆగదంటూ ఆదిలాబాద్ వేదికగా రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 🎤😊

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page