తెలంగాణలో కుటుంబపాలన అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యాలపై 🤔 మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) కౌంటర్ స్పందించారు. 👏 కుటుంబ పాలనపై రాహుల్ మాట్లాడటం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 👪
నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరు..? 🤔 రాహుల్, ప్రియాంక సమాధానం చెప్పాలి.. 😊 అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 📣 అంతేకాకుండా రేవంత్‌రెడ్డిని పక్కన పెట్టుకుని.. 🙄 అవినీతిపై రాహుల్ మాట్లాడటం విడ్డూరం అంటూ విమర్శించారు. 💬 పీసీసీ పదవిని కొన్న రేవంత్‌ని పక్కన పెట్టుకుని.. 💼 రాహుల్ మాపై విమర్శలు చేస్తున్నారు.. 🗣️ కాంగ్రెస్ అంటే ఏ టు జెడ్ అవినీతి.. 🤨 అంటూ కేటీఆర్ విమర్శించారు. 📢 రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని.. 🎟️ డీసీసీ అధ్యక్షులే చెబుతున్నారు.. 👥 కాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలను.. 🗳️ రేవంత్‌రెడ్డి బీజేపీకి అమ్మేస్తారన్నారు. 🙌 మేం బీజేపీ బీటీమ్ కాదు.. ❌ మీరే సీ టీమ్, చోర్ టీమ్.. 🕵️ రేవంత్‌రెడ్డి బీజేపీ కోవర్టు అంటూ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. 🗳️ తెలంగాణలో నాటకాలకు తెరతీసిన కాంగ్రెస్‌ని నమ్మేదెవరన్నారు మంత్రి కేటీఆర్. 🙌 కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని.. 🤨 కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధిస్తున్నారన్నారు. 📃 ఇక్కడికొచ్చి నీతి వాక్యాలు వల్లెవేస్తున్నారా అని రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు. 🔥 ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ పీసీసీ చీఫ్ అన్నారు. 🕴️ టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతో పాటు భూములు రాయించుకుంటున్న రాబందు రేవంత్ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 💪