రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. 📜 ఇప్పటికే 41 స్థానాలకు తొలి విడతలో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ.. 🚀
తాజాగా మరో 83 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితాను వెల్లడించింది. 🎉 రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే మరోసారి ఝల్రాపటన్ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. 🧑⚖️ 2003 నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు వసుంధరా రాజే. 🏛️ రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు సతీష్ సుభాష్ చంద్ర పూనియా అంబీర్ స్థానం నుంచి, రాజస్థాన్ బీజేఎల్పీ నాయకుడు రాజేంద్ర రాథోడ్ తారానగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 🏢 గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలో చేరిన జ్యోతి మిర్దా నాగౌర్ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. 🌟 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి బీజేపీ ఇప్పటివరకు 124 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయ్యింది. 📊 మరో 76 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 🗳️
అలాగే రాజస్థాన్‌లో బరిలోకి దిగుతున్న బహుజన్ సమాజ్ పార్టీ తన 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. 🌞 మాయావతి పార్టీ అజ్మీర్, భరత్‌పూర్, కమ్మ, మహువ, తోడభీమ్, సపోత్రా, గంగాపూర్, నీమ్‌కథానా, హిండన్, బండికుయ్‌ల నుంచి టిక్కెట్లు ఇచ్చింది. 🌊"