🤝 కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని తెర్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. 🏭 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..🤲 బలహీనవర్గాల కులగణన చేపడతామని స్పష్టం చేశారు. 👨👩👧👦 కులగణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటిదన్నారు రాహుల్ గాంధీ. 🇮🇳 తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్ గాంధీ. 🤝
🦁 సింహాలు సింగిల్‌గానే కాదు.. గుంపులుగా కూడా వస్తాయ్ అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 🦁 తెలంగాణాలో కాంగ్రెస్ సింహాలు గర్జిస్తున్నాయ్.. రాబోయేది బబ్బర్ షేర్ తెలంగాణా అన్నారు. 🗣️ ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. 🏞️ తెలంగాణాలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే, నాలుగు నెలల్లోనే ఓబీసీ కులగణన చేపట్టి.. 🌾 వాళ్లకు రావల్సిన వాటా వాళ్లకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. 🌱 తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్. 🌾
🌍 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరీ బస్సు యాత్ర మూడో రోజు మరింత జోష్‌తో సాగింది. 🚌 జగిత్యాలలో యాత్రలో పాల్గొన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. 🙌 బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. 💼 ఈసారి దొరల తెలంగాణకు.. 🌅 ప్రజలు తెలంగాణకు మధ్యే ఎన్నికలని పునరుద్ఘాటించారు. 🗳️ తెలంగాణకు కేసీఆర్ నియంతలా, రాజులా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. 🧐 పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామన్నారు. 🌾 ఈ క్రమంలోనే ప్రజలతో తమ పార్టీకి ఉన్న ప్రేమానుబంధాలు దశాబ్దాల నాటివని ఆయన పేర్కొన్నారు. 🤗 నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల కాలం నుంచి ప్రజలతో తమకు మంచి అనుబంధం ఉందని రాహుల్ తెలిపారు. 🇮🇳
🏞️ ఇక్కడితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ విజయభేరీ బస్సు యాత్ర ముగిసింది. 🚌 కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగింది. 🙌 నిజామాబాద్ జిల్లాలో రాహుల్ విజయభేరీ యాత్ర ప్రవేశించింది. 🌆 రాహుల్ యాత్రకు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. 📢