నోట్లరద్దు , జీఎస్జీతో చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు తీరని నష్టం జరిగిందన్నారు రాహుల్‌గాంధీ. ట్యాక్స్ టెర్రరిజంతో ఆ కంపెనీ యాజమానులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరగడానికి ఇదే కారణమన్నారు రాహుల్‌గాంధీ.
‘‘చక్రవ్యూహంలో భాగంగా కోట్లాది ఉద్యోగాలు ఇచ్చే చిన్న,మధ్యతరహా పరిశ్రమలను టార్గెట్ చేశారు. నోట్లరద్దు , జీఎస్టీ , ట్యాక్స్ టెర్రరిజంతో బెదిరించారు. చిన్న వ్యాపారులకు అర్ధరాత్రి ఫోన్‌కాల్స్ వస్తాయి.. ఐటీ , జీఎస్టీ అధికారులతో వాళ్లను బెదిరించి ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. ట్యాక్స్ టెర్రరిజానికి ఆపడానికి బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ట్యాక్స్ టెర్రరిజంతో బడా వ్యాపారులకు లాభం చేశారు. చిన్నవ్యాపారులను బెదరించారు’’.. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు. రాహుల్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కేంద్రమంత్రి కిరణ్.
‘‘మీరు స్పీకర్‌ను అవమానిస్తున్నారు. సభను పక్కదోవ పట్టిస్తున్నారు. మీకు రూల్స్ తెలియదు. మీరు సభ నియమాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విపక్ష నేతకు నియమాలు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ’’
బడ్జెట్ హల్వా కార్యక్రమంలో ఒక్క దళిత , ఓబీసీ అధికారికి కూడా పాల్గొనడానికి అవకాశం ఇవ్వలేదని రాహుల్ విమర్శించారు . హల్వా సెర్మనీ ఫోటోను రాహుల్ సభలో ప్రదర్శించారు. కేంద్రం వెంటనే కులగణన చేపట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై మరోసారి బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.