కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పౌరసత్వాన్ని రద్దుచేయాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ తనకు తానుగా బ్రిటిష్ జాతీయుడినని ప్రకటించుకున్నారని, కాబట్టి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్టు ఎక్స్‌లో తెలిపారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవద్దని ప్రధాని మోదీని సోనియాగాంధీ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. యూకేలో గతేడాది రిజిస్టర్ అయిన కంపెనీ డైరెక్టర్లలో రాహుల్ ఒకరని పేర్కొన్నారు. 2005లో ఆ కంపెనీ ఫైల్ చేసిన వార్షిక రిటర్నులో రాహుల్‌గాంధీని బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారని చెప్పారు. లేఆఫ్ ప్రకటించారని.. సీఈవో పాస్‌పోర్ట్ చోరీ
బెంగళూరు: లేఆఫ్ ప్రకటించారన్న కోపంతో మాజీ ఉద్యోగి ఒకరు తన పాస్‌పోర్టు, అమెరికా వీసాను దొంగిలించినట్టు బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సార్థి ఏఐ’ సీఈవో విశ్వనాథ్ ఝా ఆరోపించారు. సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు అమెరికా వెళ్లి నిధులు సేకరించాలని భావించానని, అయితే, మాజీ ఉద్యోగి ఒకరు తన పాస్‌పోర్ట్, వీసాను దొంగిలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి కారణంగానే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. సార్థి ఏఐ గతేడాది పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. వారిలో దాదాపు 50 మందికిపైగా ఉద్యోగులకు ఏడాదికిపైగా వేతనాలు చెల్లించలేదని, కోర్టు నోటీసులకు కూడా స్పందించడం లేదని ఉద్యోగి ఒకరు ఆరోపించారు.