top of page
Suresh D

అందులో భారతి ప్రమేయం ఒకే రాయి ఇద్దరికెలా తగిలింది..? 🤔

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనపై ఇంకా అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసలు రాయి దాడి ఎలా జరిగింది? ఎవరు ఎలా ఎందుకు చేశారు? అన్నదానిపై ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు. ఒకపక్క వైసిపి టిడిపి ఆధ్వర్యంలోనే రాయి దాడి జరిగిందని, జగన్ కు వస్తున్న ప్రజల మద్దతు చూసి తట్టుకోలేక ఈ తరహా కుట్రలకు తెర తీశారని తెలుగుదేశం పార్టీపై ఆరోపిస్తుంది. తెలుగు తమ్ముళ్లు రాయి దాడి ఘటనపై బోలెడు లాజికల్ ప్రశ్నలు వేస్తూ ఇదంతా సానుభూతి కోసం జగన్ , జగన్ పార్టీ సభ్యులు ఆడుతున్న డ్రామా అని ఎదురుదాడి చేస్తున్నారు. 🤨

ఇక తాజాగా నరసాపురం ఎంపీ టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భీమవరం లోని తన నివాసంలో రచ్చబండ నిర్వహించిన ఆయన ఎవరో వేసిన ఒకే ఒక గులకరాయి సీఎం జగన్మోహన్ రెడ్డి నుదుటికి , వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఎలా తగిలిందని, అది ఎలా సాధ్యం అంటూ లాజికల్ గా ప్రశ్నించారు. శత్రువులు అంతా కలిసికట్టుగా వచ్చి తనను ఒంటరిని చేసి పంగలి కర్రతో రాయి వేసి కొడితే నేను భయపడతానా.. నా వెనుక జనం ఉన్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 16 మంది వైద్యులు, 26 మంది నర్సులు బృందంతో జగన్ కు నుదుటిపై తగిలిన చిన్న గాయానికి కుట్లు కుట్టించుకోవాల్సిన అవసరం ఉందా అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. 🤔 ఇక ఇదే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో జగన్ భార్య భారతి ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సునీత చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. 🤔 ఆమె విలేకరుల సమావేశంలో చెప్పిన నిజం ఇదేనని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో భారతి ప్రమేయం ఉందని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కేసులో సిబిఐ విచారణ పూర్తయితే ప్రస్తుతం సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రధారిగా మారతారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. 🧐


bottom of page