top of page

అస‌లు విష‌యం చెప్పిన రాఘ‌వ లారెన్స్‌..!


🎬 ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో కాంచ‌న సిరీస్‌ లో మరో కొత్త చిత్రం రాబోతోంది. కాంచ‌న, కాంచ‌న 2, కాంచ‌న 3 చిత్రాలు ఘన విజయం సాధించాయి. తాజా సమాచారం ప్రకారం, కాంచ‌న 4 చిత్రాన్ని కూడా రాఘవ లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో మొదలుకానుంది.

అయితే, ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇటీవలి వార్తల ప్రకారం, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నటించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై రాఘవ లారెన్స్ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్స్ లో ఎటువంటి నిజం లేదని, అలాంటి వార్తలను నమ్మవద్దని కోరాడు. కాంచ‌న 4లో నటించే నటీనటుల వివరాలను రాఘవేంద్ర ప్రొడక్షన్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తామని తెలిపాడు. త్వ‌ర‌లోనే ఈ వివరాలను వెల్లడిస్తామని లారెన్స్ ట్వీట్ చేశాడు.

రాఘవ లారెన్స్ చేసిన ట్వీట్‌తో మృణాల్ ఠాకూర్ కాంచన 4 చిత్రంలో నటించడం లేదని స్పష్టం అవుతోంది. ఇక ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి కొంతసేపు ఆగాల్సిందే.


Related Posts

See All

భజన కీర్తనలో చప్పట్లు కొట్టడం ఎప్పుడు మొదలయ్యిందో తెలుసా..?

చప్పట్లు కొట్టడం అనేది పురాతన కాలం నుంచి మనం అనేక సందర్భాల్లో చేసే పని. భక్తి, ప్రశంస, ఆనందం వ్యక్తపరచడానికి చప్పట్లు కొడతాం.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page