top of page
MediaFx

రామ్ చరణ్- ఉపాసనలకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..


ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తొలి రోజు భారత్ కు పతకాలు రాకపోయినా రెండో రోజు (జులై 28) మాత్రం భారత క్రీడాకారులు అదరగొట్టారు. మహిళల షూటింగ్ లో మనూ భాకర్ కాంస్య పతకం గెల్చింది. దీంతో పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరిచింది. మరోవైపు భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అదరగొడుతోంది. మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించి తదుపరి రౌండ్ కు దూసుకెళ్లింది. కాగా ఒలింపిక్‌ గేమ్స్‌ చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. చిరంజీవితో పాటు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మెగా క్వీన్ క్లింకార కొణిదెల ప్రస్తుతం పారిస్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ వీధుల్లో రామ్‌ చరణ్‌, పీవీ సింధు ఎదురు పడ్డారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. రామ్ చరణ్ వెంట రైమ్ (పెట్ డాగ్) కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా పీవీ సింధు… రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒలింపిక్ గ్రామం అంతా తిప్పి చూపించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ ను సింధు ముద్దు చేశారు. ‘మీరు ఎక్కడికి వెళ్లినా ఇది మీ వెంట ఉండాల్సిందేనా?’ అని రామ్ చరణ్ ను సింధు ప్రశ్నించగా… ‘తప్పకుండా ఉండాల్సిందే’ అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు. సింధు, రామ్ చరణ్ ల కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం నాడు కూడా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన పారిస్ లోని సెన్ నది వద్ద దర్శనమిచ్చారు. ఒలింపిక్ టార్చ్ రెప్లికాను చేతబూనిన చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.



Related Posts

See All
bottom of page