top of page
Suresh D

పుతిన్ అంతటితో ఆగడు: అమెరికా కీలక హెచ్చరిక

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే పుతిన్ అంతటితో ఆగబోదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ హెచ్చరించారు. జర్మనీలోని రామ్ స్టెయిన్ ఎయిర్ బేస్ లో ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ 20వ సమావేశంలో ఆస్టిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్కు మరోసారి మద్దతు తెలిపిన ఆయన..యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రష్యా దాడిని ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఉక్రెయిన్కు సహాయం చేస్తున్న దేశాలను ప్రశ్నించారు. ఉక్రెయిన్ బలగాలు రెండేళ్లకు పైగా రష్యా దళాలతో పోరాడాయని తెలిపారు. యుద్ధంలో రష్యా తగిన మూల్యం చెల్లించిందని, సుమారు 3,15,000 మంది రష్యాన్ సైనికులు మరణించారని చెప్పారు.

రష్యా ఇప్పటికే 211మిలియన్ డాలర్లు వృథా చేసిందని, 2026 నాటికి ఇంకా 1.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని లాస్టిన్ తెలిపారు. ఉక్రెయిన్ ఎంతో ధైర్యంగా పోరాడుతుందని కొనియాడారు. కానీ ఉక్రెయిన్ లో పుతిన్ విజయం సాధిస్తే అంతటితో ఆగబోదని స్పష్టం చేశారు. తమ మిత్ర పక్షాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కాగా, ఉక్రెయిన్కు సహాయం, శిక్షణ అందించడానికి 50 కంటే ఎక్కువ దేశాలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆస్టిన్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో డెన్మార్క్, ఎస్టోనియా, ఫ్రాన్స్, జర్మనీ, ఐస్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, బ్రిటన్ లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఉక్రెయిన్కు భద్రతా సహాయంగా 300 మిలియన్ డాలర్లను అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

bottom of page