top of page
Shiva YT

🔥🚫 అవిశ్వాస తీర్మానం పెట్టండి..

🚩🔫 మణిపూర్‌ హింసపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంటులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని INDIA కూటమి నేతలు నిర్ణయించారు. 🗣️🔍

ఎంత పట్టు పడుతున్నా ప్రధాని సమాధానం ఇచ్చే అవకాశం లేకపోవడంతో విపక్షాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. 🙅‍♂️📝 మణిపూర్‌పై మోదీ నోరు విప్పాలంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడమే మార్గమని డిసైడయ్యాయి. 🤨💬 తీర్మానానికి జవాబిచ్చే సమయంలోనైనా ప్రధాని మణిపూర్‌పై మాట్లాడతారని ప్రతిపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. 👀💬🗣️ అవిశ్వాసం పెట్టేందుకు అవసరమైన 50 మంది సభ్యుల సంతకాలతో తీర్మానం డ్రాఫ్ట్‌ సిద్ధమైంది. 📜📝👥 అయితే, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మణిపూర్‌ హింస సహ అనేక కీలక అంశాలపై చర్చించే అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి భావిస్తోంది. 🗣️👥🤔 కానీ.. మణిపూర్‌ హింసపై చర్చకు సిద్ధమని చెప్తున్న ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లులు ప్రవేశపెట్టి చర్చిస్తోంది. 💼💬🏛️ ఈ క్రమంలో మణిపూర్‌పై చర్చకు తాము ఏ మాత్రం భయపడటం లేదని బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. 📣🙌 ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల ఎలాంటి మార్పు ఉండదని.. 2018-19 ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయని.. అయితే, 2019 ఎన్నికల్లో బీజేపీ సీట్లు 282 నుంచి 300కి పెరిగాయని, మళ్లీ వారే తీసుకురావాలనుకుంటున్నారని.. ఈసారి 350కి పైగా సీట్లు వస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. 📆🗳️🏢

bottom of page