top of page
MediaFx

యూట్యూబ్ ను దుమ్ము రేపుతున్న పుష్ప 2 కపుల్ సాంగ్! 🎶🔥

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. గతంలో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్ప చిత్రానికి రెండవ భాగం ఈ మూవీ. డైరెక్టర్ సుకుమార్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన స్పెషల్ వీడియో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ చేయగా.. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ పాటకు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు తెలిపారు. ఇక ఇప్పుడు పుష్ప 2 నుంచి కపుల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే సెకండ్ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో ఓ రేంజ్‏లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సూసేకీ అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే సెకండ్ లిరికల్ సాంగ్ ఫుల్ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్. ఈ సాంగ్ చిత్రీకరణ సెట్స్ లో రష్మిక, అల్లు అర్జున్ డాన్స్ ప్రాక్టీస్ వీడియోను పంచుకుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా..ప్రతినాయకుడిగా మలయాళీ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. అయితే గతంలో పుష్ప మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఊ అంటావా మావ పాటతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈసారి కూడా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ ఉండనుందని.. కానీ ఇప్పుడు సమంత కాకుండా స్పెషల్ సాంగ్ కోసం యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకువస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.


bottom of page