top of page
MediaFx

70 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతున్న “సూసేకి” సాంగ్!

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్‌గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ది కపుల్ సాంగ్‌ను "సూసేకి" అనే టైటిల్‌తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 70 మిలియన్ వ్యూస్ మరియు 1.4 మిలియన్ లైక్స్‌ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.


bottom of page