top of page

ఎట్టకేలకు క్లియర్ అయిన పుష్ప2 సమస్యలు.!

మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఆ సినిమాకు ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగినట్టు ప్రచారం జరుగుతోంది.

Pushpa 2 Financial Issues Cleared : పుష్ప ముందు వరకు ఒక లెక్క, తర్వాత ఒక లెక్క అన్నట్టు మారిపోయింది అల్లు అర్జున్ క్రేజ్ పరిస్థితి. పుష్ప సినిమా ప్రకటించక ముందు వరకు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ పేరుతో తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా పాపులర్ అయ్యాడు కానీ ఎప్పుడైతే పుష్ప సినిమా సూపర్ హిట్ అయిందో అప్పటి నుంచి ఆయన ఐకాన్ స్టార్ గా మారే ప్రయత్నం చేస్తూ పుష్ప సినిమా సక్సెస్ తో కొంతవరకు సఫలం అయ్యాడు కూడా. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్గా నిలిచింది. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో రాసుకున్న కథతో అద్భుతాలు సృష్టించాడు సుకుమార్.ఒక ఎర్రచందనం దుంగలు కొట్టే కూలీగా కెరీర్ మొదలుపెట్టిన వ్యక్తి ఒక సిండికేట్ మొత్తాన్ని నడిపి స్థాయికి ఎలా వెళ్లాడు అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కించారు. మొదటి సినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తర్వాత కొన్ని ఇతర సినిమాలు నార్త్ లో సూపర్ హిట్ లు గా నిలిచిన నేపథ్యంలో ఈ రెండో భాగం మీద చాలా శ్రద్ధ పెట్టారు. ఇక కొద్ది రోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ జరిగిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఐటీ రైడ్స్ ముగిశాయి. అయితే ఇంకా సినిమా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇక ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగానే షూటింగ్ నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి.

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page