ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం అయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పుష్ప రాజ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. పుష్ప 2 షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి చాలా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది.
ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు ఈ డేట్ మారింది. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ మధ్య మనస్పర్థలు వచ్చాయని దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లారని ప్రచారం జరుగుతుంది. దాంతో అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. తాజాగా పుష్ప 2 గురించి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అలాగే పుష్ప2 రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. “పుష్ప మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో పుష్ప 2పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవడంతో బన్నీ-సుక్కు మ్యాజిక్ చేస్తారన్న నమ్మకం ఉంది. దాంతో చాలా ప్రెజర్ ఉంది. కానీ నేను ఎలాంటి స్ట్రెస్ లేకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. డైరెక్టర్ సుకుమార్ రెండు రోజుల్లో ఇండియాకు వస్తారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ సాంగ్ కు అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. నేను అస్సాంలో ఓ ఈవెంట్ కు వెళ్లాను.. అక్కడ కూడా ఇదే పాట వినిపించింది” అని చెప్పుకొచ్చాడు దేవిశ్రీ.