top of page
MediaFx

పూరీ జగన్నాథ్‌కు హరీశ్‌ శంకర్‌కు అదే తేడా!


ఈ ఇద్దరూ ప్రతిభ గల దర్శకులే.. అంతేకాదు ఇద్దరూ టాలీవుడ్‌లో క్రేజ్‌ వున్న డైరెక్టర్లే.. అయితే ఈ దర్శకులిద్దరూ ఈ ఆగస్టు 15 సినిమాల విషయంలో పోటిపడ్డారు. రవితేజ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక రామ్‌ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. కావ్య థాపర్‌ నాయికగా నటించిన ఈ చిత్ర నిర్మాణంలో చార్మి కౌర్‌ కూడా పాలు పంచుకున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు అనుకోకుండా ఆగస్టు 15న పోటా పోటిగా విడుదలయ్యాయి.

ఈ చిత్రం విడుదల సమయంలో తమ సినిమాకు పోటీగా వస్తున్నారని రవితేజ, హరీశ్‌ శంకర్‌ పట్ల పూరి అసంతృప్తిగా వున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఎక్కడా పూరి ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. కాని మిస్టర్‌బచ్చన్‌ టీమ్‌ మాత్రం పరోక్షంగా ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఇక ఎట్టకేలకు రెండు సినిమాలు విడుదలయ్యాయి.

రెండు సినిమాలు కూడా నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుని బాక్సీఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. అయితే హరీశ్‌ శంకర్‌ విషయానికొస్తే సినిమా విడుదలకు ముందు హరీశ్‌ శంకర్‌ ట్విట్టర్‌ వార్‌, ప్రెస్‌మీట్స్‌ల్లో ఆయన మాట్లాడిన తీరు.. మీడియాతో కాస్త అతి సంభాషణ.. సినిమా అద్బుతం.. ఆహో.. ఓహో.. అంటూ హరీష్‌ చేసిన హంగామా వల్ల ఇప్పుడు హరీష్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్‌కు గురవుతున్నాడు.

సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ మన చేతుల్లో వుండవు.. కానీ హరీశ్‌ శంకర్‌ సినిమా విడుదలకు ముందు మాట్లాడిన మాటల పర్యవసానం వల్ల ఇప్పడు ఆయనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక పూరి జగన్నాథ్‌ ఈ విషయంలో లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు పూరి ఎక్కడా కూడా అతిగా మాట్లాడటం.. సినిమాని ఆకాశానికి ఎత్తడం చేయలేదు. ఎక్కడా కూడా ఆయన హంగామా కనిపించలేదు.

అందుకే పూరీ సినిమా డబుల్‌ ఇస్మార్ట్‌ పరాజయం పొందినా.. పూరిపై పెద్దగా విమర్శలు రావడం లేదు. ఎందుకంటే తన పాడ్‌కాస్ట్‌ ద్వారా ఎంతో మంది ఉత్తేజితులను చేసి, పలు మోటివేట్‌ మాటలు చెప్పే పూరి ఈ సినిమా విషయంలో కూడా సినిమా తీశాం. జనాలకు నచ్చితే చూస్తారు.. లేకపోతే లేదు.మరో సినిమా తీద్డాం.ఇది ఆయన ఫిలాసఫీ.. అంతేకాదు పూరి కమ్‌బ్యాక్‌… మీరు హిట్‌ తీయాలి అంటూ ఆయనకు ఓ రకంగా సపోర్ట్‌ చేస్తున్నారు. దటీజ్‌ పూరి జగన్నాథ్‌..




bottom of page