top of page
MediaFx

మీరు కంప్యూటర్‌ ముందు ఎక్కువ సేపు పని చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

ఐటీ, మీడియా మరియు ప్రభుత్వ కార్యాలయాలలో గంటల తరబడి కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో పని చేస్తున్న చాలా మంది కంటి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. నిరంతరం స్క్రీన్‌పై పని చేయడం కంటికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్క్రీన్ వినియోగాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కానప్పటికీ, కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

అద్దాలు లేదా ప్రత్యేక కంటి సమస్యలు లేకున్నా, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోండి. కనీసం సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం ద్వారా ఎలాంటి కంటి సమస్యను సులభంగా తెలుసుకుని అప్రమత్తం కావచ్చు.

నిపుణులు 8-9 గంటల పాటు స్క్రీన్ వైపు చూస్తూ కంటిన్యూగా పని చేయవద్దని సూచిస్తున్నారు. ప్రతిసారీ కొన్ని నిమిషాల విరామం తీసుకోవడం ద్వారా కళ్లను రక్షించవచ్చు. ఐ రోలింగ్, ఫోకస్ షిఫ్టింగ్, స్ట్రెచ్‌ల వంటి సాధారణ కంటి వ్యాయామాలు చేయండి.

ఎండలో సన్ గ్లాసెస్ ఎంత అవసరమో, స్క్రీన్‌లపై పనిచేసేటప్పుడు మంచి నాణ్యమైన యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ ఉపయోగించాలి. స్క్రీన్ ప్రత్యక్ష కాంతి కళ్ళకు హాని కలిగించకుండా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి. నిరంతరం స్క్రీన్ వైపు చూస్తూ పని చేస్తే కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు. కంటి నొప్పులు, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. డాక్టర్ల సహాతో కంటిని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

bottom of page