top of page
MediaFx

ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్

ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య కాలం లో మనదేశం లోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇం డ్ల ధరలు సగటున వార్షి కం గా 10 శాతం పెరిగాయి. బెం గళూరులో గరిష్టం గా 19 శాతం ఎగిశాయి. ఈ ఎనిమిది నగరాల్లో ధరలు 4 శాతం నుంచి 19 శాతం వరకు పెరిగాయని రియల్టర్ల సం స్థ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్స ల్టెం ట్ కొలియర్స్ ఇం డియా, డేటా అనలిటిక్ సం స్థ లియాసెస్ ఫోరాస్ సం యుక్త రిపోర్ట్లో తెలిపాయి. బిజినెస్  May 17, 2024      బెం గళూరులో ఇం డ్ల ధరలు సగటున చదరపు అడుగుకు రూ.10,377కి చేరాయి. గత ఏడాది ఇదే కాలం లో చదరపు అడుగు రూ.8,748గా ఉం ది. లియాసెస్ ఫోరస్ మేనేజిం గ్ డైరెక్టర్ పం కజ్ కపూర్ మాట్లాడుతూ బెం గళూరుతో పాటు ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్, పూణేలలో గణనీయమైన పెరుగుదల ఉం దని ఆయన తెలిపారు. తక్కు వ ద్రవ్యో ల్బ ణం , తక్కు వ వడ్డీ రేట్లు కారణం గా డిమాం డ్‌ ఇక నుంచి కొనసాగవచ్చ ని అన్నా రు. ధరలు మరో10–15 శాతం పెరగవచ్చ ని కపూర్ చెప్పారు. క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెం ట్ బొమన్ ఇరానీ మాట్లాడుతూ ప్రీమియం , లగ్జరీ హౌసిం గ్లకు దేశవ్యా ప్తం గా బలమైన డిమాం డ్ ఉం దని చెప్పారు. నగరాల వారీగా ధరల పెరుగుదల ఢిల్లీ-–ఎన్‌సీఆర్‌లో ఇం డ్ల ధరలు 16 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.9,757కు చేరుకున్నా యి. అహ్మ దాబాద్, పూణేలలో రేట్లు వార్షి కం గా 13 శాతం పెరిగి వరుసగా చదరపు అడుగుకు రూ.7,176, చదరపు అడుగుకు రూ.9,448కి చేరాయి. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.11,323కి చేరుకోగా, చెన్నై లో ధరలు 4 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.7,710కి చేరుకున్నా యి. ముం బైలో ధరలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.20,361కి చేరుకున్నా యి. కోల్‌కతాలో ధరలు చదరపు అడుగుకు రూ.7,211 నుంచి 7 శాతం పెరిగి రూ.7,727లకు చేరుకున్నా యి.


bottom of page