top of page

🎥🌟 గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌ 🎬🤩

🔥 ప్రభాస్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్- కే (వర్కింగ్‌ టైటిల్‌) ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది. 🤩 సినిమాలో డార్లింగ్‌ ఫస్ట్‌లుక్‌పై విమర్శలను తిప్పిగొట్టేలా ఈసారి అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

🔥 ప్రభాస్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్- కే (వర్కింగ్‌ టైటిల్‌) ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేసింది. 🤩 సినిమాలో డార్లింగ్‌ ఫస్ట్‌లుక్‌పై విమర్శలను తిప్పిగొట్టేలా ఈసారి అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ✨ అలాగే ఈ మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 💥 ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. 👊 అప్పుడు అంతం ఆరంభమవుతుంది’ అనే డైలాగ్‌తో మొదలైన గ్లింప్స్‌ ప్రభాస్‌ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. 😎 హాలీవుడ్‌ రేంజ్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌, గ్రాఫిక్స్‌ విజువల్స్‌ అదిరిపోయాయి. 🌠 ఇక సూపర్‌ హీరోగా ప్రభాస్‌ ఎంట్రీ, లుక్‌ నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది. 🦸‍♂️ ‘వాటీజ్‌ ప్రాజెక్ట్‌- కె’ అనే డైలాగ్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. 🤗 ఇక దీపికా పదుకొణె క్యారెక్టర్‌ కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. 😉 మహానటి తర్వాత నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. 🤩 కాగా అమెరికాలో జరుగుతోన్న శాన్‌డియాగో కామిక్‌ కాన్‌ ఫెస్టివల్‌లో ప్రాజెక్ట్‌ కే గ్లింప్స్‌, టైటిల్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. 🌟కాగా ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో రిలీజైన తొలి ఇండియన్‌ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులకెక్కింది. 🎉 హీరో ప్రభాస్, కమల్ హాసన్, రానా దగ్గుబాటి తదితరులు ఈ ఈ వెంట్లో సందడి చేశారు. 💪 ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్ హాసన్‌ కీలక పాత్ర పోషించనున్నారు. 🎭 వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ భారీ వ్యవయంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 🎬 సైన్‌స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. 🌌 ఈ నేపథ్యంలో రిలీజైన గ్లింప్స్‌ హైప్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లింది. 🚀


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page