top of page
Suresh D

గురూజీకి సినిమా ఎలా తీయాలో మీరు చెప్పాలా? మీకు అర్హత ఉందా?🎥✨

రివ్యూవర్లపై స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా ఓ రివ్యూవర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పెద్ద హీరోల సినిమాలకి లాజిక్‌తో పని లేదని.. అలాంటివి  చూసేవాళ్ళు సినిమాలకి రివ్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాగ వంశీ అన్నారు. ఇక గుంటూరు కారం సినిమాపై అంత నెగెటివిటీ రావడానికి కూడా రివ్యూలే కారణమని ఫైర్ అయ్యారు. అయినా ఎన్నో గొప్ప సినిమాలు తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ లాంటి వ్యక్తిని విమర్శించే హక్కు మీకెక్కడిదంటూ ప్రశ్నించారు. సినిమా అనేది వినోదం కోసం తీస్తామనే విషయాన్ని కూడా గమనించాలన్నారు.సలార్‌ సినిమాలో ప్రభాస్‌ లాంటి కటౌట్ ఫైట్స్ చేస్తుంటే ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ ఆ సినిమాలో కూడా లాజిక్స్ లేవంటూ చాలా మంది కామెంట్ చేశారు. మరి ఆ చిత్రం అన్ని కోట్లు కలెక్ట్ చేసింది కదా మరి వాళ్ల అభిప్రాయం తప్పా? ఇక 'గుంటూరు కారం'లో కూడా హీరో తరచుగా హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. దీనికి కూడా అయినా అలా వెంటనే హైదరాబాద్ ఎలా వెళ్లిపోతున్నాడంటూ పిచ్చి లాజిక్స్ లాగారు. ఇలా మాట్లాడే వాళ్ల కోసం గుంటూరు నుంచి మొదలయ్యే మూడున్నర గంటల జర్నీని మూవీలో చూపించలేం కదా. ఇక ఈ సినిమాలో మాస్‌ సీన్స్‌ లేవని, త్రివిక్రమ్ మార్క్‌ కనిపించలేదని ఏవోవే చెప్పారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక సినిమా చాలా బావుందంటూ నాకు ఎంతోమంది మెసేజ్ చేశారు. అయినా సినిమాను వినోదం కోసమే తీస్తామనే సంగతిని అందరూ గమనించాలి. ఇక ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న త్రివిక్రమ్ లాంటి వ్యక్తికి సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. అయినా అలా కామెట్ చేసే వారికి ఆ అర్హత ఉందా అంటూ నాగ వంశీ మాట్లాడారు.🎥✨

bottom of page