top of page
Suresh D

అవుట్‌ అండ్‌ అవుట్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘సుందరం మాస్టర్’ ట్రైల‌ర్✨🎬

టాలీవుడ్‌ కమెడియన్ వైవా హర్ష క‌థ‌నాయ‌కుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుందరం మాస్టర్ . ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఆర్టీ టీమ్ వర్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. 

ఈ సినిమా ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఒక మారుమూల గ్రామంలో అనుమానాస్పదంగా ఏవో సంఘటనలు జరుగుతుంటాయి. అయితే అవి క‌నిపెట్టడానికి సుందరం మాస్టర్(ఇంగ్లీష్ టీచ‌ర్‌)గా ఆ గ్రామంలో అడుగుపెడ‌తాడు వైవా హర్ష . అయితే గ్రామానికి ఇంగ్లీష్‌ టీచర్‌గా వెళ్లిన సుందరం మాస్టర్‌కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఈ సినిమా క‌థ. ఇక ఈ ట్రైల‌ర్ మొత్తం ఫుల్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన్‌గా సాగింది. ✨🎬


Komentáře


bottom of page