top of page

ప్రియాంక చోప్రా..ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు..

దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది.

ప్రియాంక చోప్రా.. ప్రపంచానికే పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు గత రెండు దశాబ్దాలుగా ప్రియాంక బాలీవుడ్ మెరుపులు మెరిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది. హాలీవుడ్ అభిమానులని సైతం తన అందంతో సమ్మోహనపరుస్తోంది.

ఈ మాజీ విశ్వ సుందరి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. 40 ఏళ్ల వయసులో ప్రియాంక చెక్కు చెదరని ఒంపులతో ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా రాణించిన తర్వాత ప్రియాంక హాలీవుడ్ బాట పట్టింది.

తన భర్త నిక్ జోనస్ తో ప్రేమాయణం మొదలు పెట్టాక ప్రియాంక కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. నిక్ తో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి ప్రియాంకకు హాలీవుడ్ లో పరిచయాలు బాగా పెరిగాయి. ఫలితంగా హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది.

ఇంటర్నేషనల్ మూవీ ఈవెంట్స్ లో ప్రియాంక హాలీవుడ్ భామలని సైతం డామినేట్ చేస్తూ అందంతో మెప్పించడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాగా తగ్గించింది. తన భర్త నిక్ జోనస్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది.

ప్రియాంక చోప్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ న్యూయార్క్ మెట్ గాలా 2023లో పాల్గొంది పిసీ తన భర్త నిక్ జోనస్ తో కలసి ఈ ఈవెంట్ లో సందడి చేసింది. రెడ్ కార్పెట్ పై ప్రియాంక అందాలు ఒలకబోస్తూ అక్కడున్న వారిని ఆకర్షించింది.

ముఖ్యంగా ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది. బ్లాక్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో పిసీ డీప్ గా థైస్ సొగసు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా పిసీ స్టైలిష్ గా సెక్సీగా ఇచ్చిన ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి.

ఇక ఈ ఈవెంట్ లో ప్రియాంక తాను ధరించిన నెక్లెస్ తో కూడా హాట్ టాపిక్ గా మారింది. బల్గారి 11.6 క్యారెట్నె డైమండ్ నెక్లెస్ ని ఆమె ఈ ఈవెంట్ లో ధరించారు. ఆ డైమండ్ నెక్లెస్ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఆ డైమండ్ నెక్లెస్ ధర ఏకంగా రూ.204 కోట్లు.

ఈ నెక్లెస్ ని మెట్ గాలా ఈవెంట్ తర్వాత వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఈవెంట్ లో తనకు మాత్రమే సాధ్యమైన గ్లామర్ షోతో ప్రియాంక చోప్రా మెరుపులు మెరిపిస్తోంది.

ఆమె థైస్ పై నెటిజన్లు కొంటె వ్యాఖ్యలు చేస్తూ అందాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ రేంజ్ లో పరువాలు ఒలకబోస్తే ప్రపంచం మొత్తం ఆమెకి దాసోహం అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page