top of page

'ఆడుజీవితం' ఆల్ టైమ్ రికార్డ్..🎥✨

పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తాజా సర్వైవల్ డ్రామా 'ది గోట్ లైఫ్‌' (ఆడుజీవితం) వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రముఖ మలయాళ నవల 'ఆడుజీవితం' ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డ్ అందుకుంది. USA బాక్సాఫీస్ వద్ద అత్యంత వేగంగా మిలియన్ డాలర్ల మార్కును దాటిన మలయాళ చిత్రంగా ఆడుజీవితం నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల్లో రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆదివారం మరో రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఫస్ట్ వీకెండ్‌లో మొత్తం రూ.65 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో మలయాళ సినిమాల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరేలే కనిపిస్తుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నట విశ్వరూపమే చూపించారు. ముఖ్యంగా నజీబ్ పాత్ర కోసం ఆయన 31 కిలోలు బరువు కూడా తగ్గారు. ఇక ఎడారిలో షూట్ చేసిన ఓ సన్నివేశంలో రిబ్స్ కనిపించేంత సన్నగా పృథ్వీరాజ్ ట్రాన్స్‌ఫామ్ అయిన విధానం చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.  ఇక ఈ సినిమా తెలుగులో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఆడుజీవితంగా డబ్ అయిన ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.🎥✨

bottom of page