అక్టోబర్ 1న శనివారం (శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్‌నగర్ పట్టణ శివార్లలోని భూత్‌పూర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
మోడీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. అయితే, ప్రధాని మోడీ సభ ఎన్నికలకు ముందు కీలకం కానుంది. ఓ వైపు సభతో పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడం.. మరోవైపు నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే టార్గెట్‌గా ప్రధాని మోదీ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని మోడీ సభ తర్వాత బీజేపీ కూడా అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం వెల్లడించే ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీతోపాటు.. బీజేపీ అగ్రనేతలు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. మోడీ సభ అనంతరం 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో, 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది.
వాస్తవానికి మొదట సెప్టెంబర్ 28, 29 తేదీల్లోనే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారని అందరూ భావించారు. కానీ అది వచ్చేనెలకు ఖరారు చేశారు. తొలుత అక్టోబరు 2న టూర్ ఖరారు చేసినా.. చివరికి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ ఒకటవ తేదీన మహబూబ్‌నగర్ సభలో పాల్గొంటారని తెలిపారు. పాలమూరులో ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తూ.. కమిటీలను సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మోడీ సభకు తరలించేలా ప్లాన్ రచిస్తున్నారు. 📢📅🗣️'