top of page

ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించిన ప్రధాని మోదీ..వైరల్ అవుతున్న ఫోటోలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సాధారణ జనం మధ్యకు రావాలంటే భారీ భద్రత ఉండాల్సిన దేశాధినేత..ఎంతో సాదాసీదాగా మెట్రో రైల్‌లో ప్రయాణం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించారు. ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. సాధారణ జనం మధ్యకు రావాలంటే భారీ భద్రత ఉండాల్సిన దేశాధినేత..ఎంతో సాదాసీదాగా మెట్రో రైల్‌లో ప్రయాణం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఉత్సవాలకు ప్రధాని తన కాన్వాయ్‌లో కాకుండా మెట్రో రైల్‌లో సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. మోదీ మెట్రో జర్నీ ఫోటోలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.మెట్రోరైల్‌లో ప్రయాణించిన ప్రధాని ..తోటి ప్రయాణికులతో మాట,మంచి తెలుసుకున్నారు. ముఖ్యంగా బోగీలో ఎక్కిన విద్యార్ధులతో చర్చించారు. వారి విద్యార్హతలతో పాటు కెరియర్‌ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.దేశ ప్రధాని తమతో కలిసి మెట్రో రైల్‌లో ప్రయాణం చేయడాన్ని ఆశ్చర్యంగా ఫీలైన విద్యార్ధులు, ఉద్యోగులు..ఆయన అడిగిన విషయాలు, మాట్లాడిన అంశాలతో పాటు ఇచ్చిన సూచనలను ఆసక్తిగా ఆలకించారు. ఎంతో సంతృప్తి చెందారు.ప్రధాని మోదీ శతాబ్ధి ఉత్సవాలకు వస్తున్నందున స్టూడెంట్స్‌కి ఢిల్లీ యూనివర్సిటీ యాజమాన్యం పలు మార్గదర్శకాలను సూచించింది. నలుపు రంగు దుస్తులు వేసుకొని రావద్దని ఆదేశించింది.అంతే కాదు ప్రతీ ఒక్కరూ ఈ వేడుకలకు హాజరు కావాలని సెర్కులర్ జారీ చేసింది. ప్రధాని రాక సందర్భంగా ఉదయం 10-12 గంటల మధ్య క్లాసులను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది.ప్రధాని హోదాలో దేశ, విదేశాలు, పర్యటించి..అక్కడి పాలకులు, పెద్దలతో చర్చలు జరిపే నరేంద్ర మోదీ సింపుల్‌గా ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ధి వేడుకల చీఫ్‌ గెస్ట్‌గా ఆహ్వానిస్తే అంతే హుందాగా, సింపుల్‌గా మెట్రో రైల్‌లో వాటికి హాజరుకావడం హాట్ టాపిక్‌గా మారింది.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page