top of page
Shiva YT

🚀 తమిళనాడులో ప్రధాని మోదీ..

🌍 తమిళనాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. తూత్తుకుడి కేంద్రంగా నిర్మించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజెన్‌ హబ్‌ పోర్ట్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుల్లో ఔటర్‌ హార్బర్‌, కంటైనర్‌ టెర్మినల్స్‌ కూడా ఉన్నాయ్‌. మొత్తంగా 17వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.

🚢 కులశేఖరపట్టణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. రెండో అంతరిక్ష నౌకాశ్రయానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పేస్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీహరికోట కంటే కులశేఖరపట్టణం.. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటంతో రాకెట్‌ విడిభాగాల రవాణా మరింత ఈజీకానుంది. సమయం, ఖర్చు రెండూ తగ్గనున్నాయి. 🌌

Comments


bottom of page