జమ్ము కశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేసే ఒకరోజు ముందు అంటే.. 2019 ఆగస్టు 4న.. ప్రధాని నరేంద్రమోడీ.. రాష్ట్రపతిని కలిసేందుకు సాయంత్రం ఆలస్యంగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు ఇదే సరైన సమయమని గమనించారు. ఆ సమయంలో ప్రధానమంత్రి తన భద్రతా సిబ్బంది, అనుచరగణం లేకుండా గుర్తుపట్టలేని కారులో ఒంటరిగా ప్రయాణించారు. వివాదాస్పద ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై ఆయన ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, సున్నితమైన ఎజెండా గురించి అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించడానికి ప్రధాని ఇదే మార్గమని భావించారు.
త్వరలో విడుదల కానున్న చిత్రం ‘ఆర్టికల్ 370’లో భాగమైన బిజెపి హామీలలో ఒకదాన్ని నెరవేర్చడానికి మోడీ ప్రదర్శించిన రహస్య రాజకీయ ఆపరేషన్ గురించి ఇప్పటివరకు తెలియని వివరాలను ఇప్పుడు అధికారిక మూలాలు కూడా ధృవీకరించాయి. బీజేపీ అద్భుతమైన విజయం, మోడీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత .. ఎలాంటి వ్యూహాలు రచించారు. జమ్ముకశ్మీర్ ఏకీకరణ కోసం చేసిన ప్రతిజ్ఞకు ఆయన నిబద్ధతను నొక్కిచెప్పడం.. బిజెపి పట్ల విశ్వాసం పెరిగేలా చేయడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను దానిలో వివరించారు. రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకుని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఏ విధంగా ఆకట్టుకుంది అనేదాన్ని కూడా ప్రస్తావించారు.
370 రద్దు నాటి నుంచి J&Kలో ఉగ్రవాద కేసులు తగ్గుముఖం పట్టడం.. ఈ ప్రాంతంలో పర్యాటకుల రాక బాగా పెరగడం, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రెట్టింపు కావడం వంటివి మోడీ స్క్రిప్టు నుంచి హోం మంత్రి షా అమలు చేసిన నిర్ణయాలకు ధ్రువీకరణగా ప్రభుత్వం పేర్కొంది . ‘ఆర్టికల్ 370’లో అనేక సంచలనాత్మక కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పటికీ దశాబ్దాలుగా స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ను NIA మహిళా అధికారి కాలర్ పట్టుకున్న దృశ్యం కూడా ఇందులో చూపించారు. 🇮🇳💪